Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
- సత్తుపల్లి కోవిడ్ సెంటరుకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ రూ.లక్ష విరాళం
నవతెలంగాణ- సత్తుపల్లి
కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న పేద వర్గాలకు డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సంస్థ వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం స్థానిక కోవిడ్ సెంటర్ కు ఎన్ఆర్ఐ రు.లక్ష విరాళాన్ని ఎమ్మెల్యే సండ్ర చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు బయ్యన బాబూరావు మాట్లాడుతూ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి మేరకు సత్తుపల్లి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఇదే నేపధ్యంలో సత్తుపల్లి కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ కు తమ సంస్థ ద్వారా రూ.లక్ష అందించామన్నారు. కార్యక్రమాల్లో భాగంగా కల్లూరు మండలంలో ఐసోలేషన్ పూర్తి చేసిన కోవిడ్ బాధితులకు డిస్టిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్థులు సంయుక్తంగా రూ.50 వేలు విలువ గల నిత్యావసర సరుకులు బాధితులకు ఎమ్మెల్యే వెంకటవీరయ్య చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ పాల్గొన్నారు.