Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రిష్ణయ్య
నవతెలంగాణ-మణుగూరు
కరోనా భారీన పడిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్ధికసాయం అందజేసినట్టు సీఐటీయూ జిల్లా కార్యదర్శి గద్దల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగాని క్రిష్ణయ్య చేతుల మీదుగా కరోన భారీన పడిన కాంట్రాక్ట్ కార్మికులకు నగదు సాయం అందజే శారు. ఈ సందర్భంగా క్రిష్ణయ్య మాట్లాడుతూ... సిం గరేణిలో కరోనా వైరస్ సోకిన కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలన్నారు. కరోనా వలన మృతి చెం దిన కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలకు రూ.15లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్మి నేంట్ కార్మికుల మాదిరిగా వ్యాక్సినేషన్, ఉచిత వై ద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు బి.క్రిష్ణయ్య, మాధవ్, కార్మికులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : సింగరేణి మణుగూరు ఎస్ఎంఎస్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తూ కరోనా వ్యాధి సోకి 15 రోజుల పాటు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ కార్మికులు సత్యనారాయణ, బాలకృష్ణలకు సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సోమy ారం రూ.4 వేలు ఆర్థిక సహాయాన్ని సీఐటీయూ నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రగాని కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గద్దల శ్రీనివాస్, బ్రాంచ్ అధ్యక్షులు బి.కృష్ణయ్య చేతుల మీదుగా కాంట్రాక్ట్ కార్మికులకు నగదు సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవ్ ఎస్ఎంఎస్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.