Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -కూసుమంచి
మండలంలోని పాలేరు జలాశయంలో ఈ నెల 12న చేపల వేట ప్రారంభించాల్సి ఉంది.కాని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఈనెల 15న మళ్ళీ మత్స్య సొసైటీ సభ్యులు చేపల వేట ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ మత్స్యకారులు ఒక రోజు ముందుగానే సోమవారం ఉదయం చేపలవేట ప్రారంభించారు.
దీంతో కొంతమంది మత్స్యకారులకు సమాచారం లేక పోవడంతో అయోమయంలో ఉన్నారు. మత్స్యకార కొన్ని కుటుంబాలకు సమాచారం కూడా లేదు. అలాంటి కుటుంబాలు ఈ సంవత్సరం ఆర్థికంగా నష్టపోయినట్లు అని కొందరు మత్స్య కారులు వాపోయారు. దీంతో పాలేరు జలాశయం చుట్టుపక్కల గ్రామాల్లో అప్పటికప్పుడు మత్స్య ప్రియులు సమాచారం తెలుసుకొని చెరువు వద్దకు వచ్చి చేపలు కొనుగోలు చేశారు.