Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పట్ల మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్ కర్ణన్, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ విజరు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ తదితర అధికారులతో కలిసి హైదరాబాద్ నందు ఉన్నత స్థాయి సమీక్ష ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ నిర్వహించారు.ఖమ్మం నగరంలో సుడా నిధులతో జరుగుతున్న పనులు, గోళ్లపాడు ఛానల్, సీఎం అస్సూరెన్సు పనులు, మిషన్ భగీరథ, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠధామంలలో అదనపు వసతులు, తదితర పెండింగ్ పనులపై సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలు, జరగాల్సిన పనుల వివరాలను అధికారాలను అడిగి తెలుసుకున్నారు. పనుల జాప్యం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జరుగుతున్న పనులు మరింత వేగంగా చేయకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.