Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల పరిధిలోని మోటమర్రి, రావినూతల, బోనకల్, బ్రాహ్మణపల్లి, కలకోట రామాపురం,పెద్ద బీరవల్లి, తూటికుంట్ల గ్రామాలకు చెందిన ఐదుగురికి రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజరు ద్వారా 1,30,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయ్యాయి. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ద్వారా జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో 1,62,500 రూపాయల ఐదుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయింది. బోనకల్ మండల కేంద్రంలో పది మంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సోమవారం అందజేశారు. మొత్తం 2,93,000 రూపాయల విలువ చేసే పది చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జున్ రావు, మాజీ జెడ్పిటిసి బానోతు కొండ రామాపురం, బ్రాహ్మణపల్లి, రావినూతల సర్పంచులు తొండపు వేణు, జెర్రీ పోతుల రవీంద్ర, బోనకల్ ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవరావు, టిఆర్ఎస్ నాయకులు రెడ్డి బోయిన ఉద్దండు, ఇటికాల శ్రీనివాసరావు, షేక్ హుస్సేన్ సాహెబ్ వివిధ గ్రామాల నుంచి టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.