Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్, ఉప మేయర్లకు మంత్రి కేటీఆర్ అభినందనలు
నవతెలంగాణ-గాంధీచౌక్
అభివృద్ధి చెందిన ఖమ్మం నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారాలకు పుర పాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచిం చారు. హైదరాబాద్ నందు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ నేతృత్వంలో మేయర్, ఉప మేయర్లు మంత్రి కేటీఆర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచం ఇచ్చి అభినందనలు తెలిపారు. మంత్రి పువ్వాడ అజారు కుమార్ ఆధ్వర్యంలో నగరం చాలా అభివృద్ధి చెందిందని, దాని కొనసాగింపుగా మీ వంతు కృషి చేసి మరింత అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేయాలన్నారు. వారి వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ కర్ణన్ , మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ బచ్చు విజరు తదితరులు ఉన్నారు.