Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశ్వనాధపల్లిలో 100 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
- అక్రమ వ్యాపారాలపై నిఘా
నవతెలంగాణ-కారేపల్లి
అక్రమంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా రు. సింగరేణి సీఐ బాణాల శ్రీనివాసులు, ఎస్సై పీ.సురేష్‌లు అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు నిఘా పెట్టి అక్రమార్కులు పని పడుతున్నారు. మంగళవారం కారేపల్లి మండలం విశ్వనాధపల్లి భారిగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తాత వీరయ్య, గుడివాడ వెంకటేశ్వర్లు లకు చెందిన ఇండ్లలో నిల్వ ఉంచిన సుమారు 100 క్వింటాళ్ల బియ్యంను సీఐ బాణాల శ్రీనివాసులు, ఎస్సై పీ.సురేష్ ల ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో విశ్వనాధపల్లికి చెరుకున్న వారు సోమవారం రాత్రి నుండి గ్రామంలో తనిఖీలు చేసి పకడ్భంధిగా వలపన్ని అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్నారు. మండలంలో అక్రమాలకు ప్రధాన కేంద్రాలపై దృష్టిపెట్టిన పోలీసుల ఆదిశగా నిఘా పెంచి అక్రమా ర్కుల అటకట్టించటంలో సఫలమవుతున్నారు. గేటుకారేపల్లి, గాదెపాడు, విశ్వనాధపల్లిలోపోలీసుల జరిపిన దాడులతో అక్రమార్కుల గుండెల్లో భయం పట్టుకుంది. అక్రమ బియ్యం రవాణా దారుల ఆటకట్టిస్తున్నట్లే, యువతను నిర్విర్యం చేస్తున్న నిషేధిత పోగాకు ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.