Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుద్రమ మండల మహిళ సమైఖ్య అధ్యక్షురాలు సుజాత
నవతెలంగాణ-మణుగూరు
మండలంలో రుద్రమ మండల మహిళ సమైఖ్య ఆధ్వర్యంలో వ్యవసాయ అద్దె పరికరాలు వెలుగు కార్యాలయం నందు అందుబాటులో వున్నాయని మహిళ సమైఖ్య అధ్యక్షురాలు కె.సుజాత, ఏపీఎం ఎస్డీ అహ్మదుల్లా తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరుల మాట్లాడుతూ... ట్రాక్టర్ జాన్డ్రీర్ 44 హెచ్పి అద్దె రూ.800, ట్రాలీ 5 టన్నుల కెపాసిటి అద్దె రూ.400, డిస్కు హౌరో అద్దె రూ.400, డిస్కు ఫ్లో త్రీ బాటమ్ అద్దె రూ.700, హాప్కీజ్ వీల్స్ 150 కెజి అద్దె రూ.500, రోట వేటర్ అద్దె రూ.1000, కల్టివేటర్ 9 రకాలు అద్దె రూ.800, ప్లో అద్దె రూ.800 అందుబాటులో వున్నాయని కావున రైతులు వినియోగించుకోవాలని వారు తెలిపారు. వివరాలకు మండల సమైఖ్య, వెలుగు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.