Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.18 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం
నవతెలంగాణ-గాంధీచోక్
రైతుల దగ్గర సరుకు కొనుగోలు చేసి సుమారు రూ.36 లక్షలు ఇవ్వకుండా పరారీలో ఉన్న బావ్ సింగ్ అనే కమీషన్ ఏజెంట్ వివాదం మంగళవారం ఓ కొలిక్కి వచ్చింది. కమిషన్ ఏజెంట్ బావ్ సింగ్ మూడునెలల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో రూ. 36 లక్షల విలువైన సరుకు కొనుగోలు చేశాడు. అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. నాటి నుంచి అతని కోసం పోలీసుల సహాయంతో రైతులు వెదకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సహచర కమీషన్ ఏజెంట్లు మంగళవారం బావ్ సింగ్ ను మార్కెట్ కు తీసుకొచ్చారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది వెంకటరమణ, సెక్రటరీ మల్లేశం, దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బజ్జూరి వెంకట రమణారెడ్డి, త్రీటౌన్ సీఐ శ్రీధర్ సమక్షంలో సమస్యను కొలిక్కి తెచ్చేందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ భవన్ లో చర్చించారు. కమిషన్ ఏజెంట్ బావ్ సింగ్, గుమాస్తా గోళ్ళ గురవయ్య రూ. 18 లక్షలు శనివారం నాటికి ఇచ్చేందుకు అంగీకరించడంతో సమస్య కొంతమేర కొలిక్కి వచ్చింది.