Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఎర్రుపాలెం
మండల పరిధిలోని గుంటుపల్లి గోపవరం గ్రామంలో సోమవారం రాత్రి పట్టుబడిన విత్తనాల వ్యవహారంపై మంగళవారం ఖమ్మంజిల్లా టాస్క్ ఫోర్స్ ఏసిపి స్నేహ మెహరా (ఐపీఎస్) ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించి కేసు పురోగతిని గురించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ... నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందు నిల్వల వ్యవహారంపై రెండు మూడు రోజుల్లో పూర్తి సమాచారం వస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామానుజం, వైరా ఏసీపీ సత్యనారాయణ, మధిర సీఐ ఓ మురళీ, మధిర ఎస్ఐ సతీష్ కుమార్, ఎర్రుపాలెం ఎస్ఐలు ఉదరు కిరణ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.