Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలి
- కలెక్టర్ డి.అనుదీప్
నవతెలంగాణ- కొత్తగూడెం
7వ విడత హరితహారం కార్యక్రమంలో శాఖల వారిగా నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు నాటాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో హరితహారం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ హరితహరంలో మొక్కలు నాటేందుకు ముందస్తుగా స్థలాన్ని గుర్తించి, గుంతలు తీయు కార్యక్రమాన్ని పూర్తి చేసి మొక్కలు నాటేందుకు సంసిద్ధం కావాలన్నారు. 22 శాఖలతో పాటు టీఎస్ ఎఫ్ఏసీ, నాలుగు మున్సిపార్టీలకు కలిపి 1కోటి 5 లక్షల మొక్కలు నాటు విధంగా లక్ష్యాన్ని నిర్దేశిం చినట్టు చెప్పారు. హరితహారం కార్యక్రమం నిర్వహ ణకు పక్కా ప్రణాళిక అవసరమని చెప్పారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి హారితహారం కార్యక్రమంపై సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారని అట్టి ఆదేశాల మేరకు మొక్కలు నాటు విధంగా కార్యాచరణ తయారు చేయాలని ఆయన స్పష్టం చేశారు. 19వ తేదీ తరువాత ముఖ్య మంత్రి అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పల్లె, పట్టణ ప్రగతితో పాటు హరితహారంలో మొక్కలు పెంపకాన్ని తనిఖీ చేయనున్నారని హెచ్చరించారు. 7వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం నుండి 15 రోజుల్లో జిల్లాకు కేటాయించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్న 6 మొక్కలు ప్రజల అభీష్టం మేరకు చేయాలన్నారు. నాటిన మొక్కల ఫోటోలతో పాటు, జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్, డిఆర్ అశోక్ చక్రవర్తి, డీఆర్డిఓ మధుసూదనాజు, జడ్పీ సీఈఓ ఎం.విద్యాలత, డీపీఓ రమాకాంత్, వ్యవసాయ అధికారి కె.అభిమన్యుడు, ఎక్సైజ్ ఈఎస్ నరసిం హారెడ్డి, ఇరిగేషన్ ఈఈలు ప్రసాద్, అర్జున్, పిఆర్ ఈఈ సుధాకర్ రావు, ఆర్ అండ్ బి ఈ ఈ భీమ్లా తదితరులు పాల్గొన్నారు.
ట్రీ పార్కు ఏర్పాటు చేయాలి-కలెక్టర్
మున్సిపాల్టీలలోని ప్రతి వార్డులో ట్రీ పార్కు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు. మంగళవారం కలెక్టరే ట్లో రహదారుల మరమ్మతులు, హరితహారంపై డీఆర్డిఓ, జడ్పీ, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలతో తెలంగాణకు హరిత హారం కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో రహదారులపై నీటి నిల్వలు లేకుండా గ్రావెల్ వేసి రోలింగ్ చేయాలని చెప్పారు. జిల్లాలో 1281 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచామని అదే స్పూర్తిని కొనసాగించి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.