Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.అభిమన్యుడు
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలో వ్యవసాయం చేస్తున్న రైతాంగం లైసెన్స్ ఉన్న డీలర్స్ నుండి విత్తనాలు కొనుగోలు చేయాలని, వారి పొలం భూ సారాన్ని బట్టి మేలైన వంగాడాలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె. అభిమన్యుడు కోరారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులు వ్యవసాయా ధికారుల సూచనలతో సాగు చేయాలని కోరారు. దళారులు, మధ్యవర్తుల నుండి విత్తనం కొనుగోలు చేయవద్దని కోరారు. గ్రామాల్లో ఎవరైన గుర్తుతెలి యని వక్తులు, అక్రమంగా నిల్వ ఉంచి విత్తనాలు అమ్మితే వెంటనే వ్యవసాయాధికారికి తెలపాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన తరువాత వాటి మొలక శాతం గమనిం చాలని తెలిపారు. విత్తనాలకు విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం ద్వారా సక్రమించే చీడపీడ పురుగులను, తెగుళ్లను అరికట్టవచ్చు నన్నారు. వరి విత్తనాలకు బావిస్టిన్ 1 గ్రామ మందును 1 లీటర్ నీటికి కలిపి 30 కేజీల వరి విత్తనాన్ని 30 గ్రాముల బావిష్టిన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలని కోరారు. పొడి విత్తనామైతే 2 గ్రాముల బావిస్టిన్ కేజి విత్తనానికి పట్టించాలన్నారు. సూడోమినాస్ 8 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ట్రైసైక్లోజోల్ 0.6 గ్రామలు 1 కేజీ విత్తంకు సరిపోతుందని తెలిపారు. మొక్కజొన్న విత్తనానికి విత్తన శుద్దికి గాను మాంకోజెబ్ 3 గ్రాములు 1 కేజి విత్తనానికి వినియో గించాలని తెలిపారు. అపరాలుకు రైజోబియం కల్చర్‌ను విత్తనాన్ని పట్టించి విత్తుకున్నట్లయితే వేరు బుడిపెలు సంఖ్య పెరిగి వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి, తద్వారా ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చని వివరించారు. రైతులు వారి పరిధిలో ఉన్న వ్యవసాయాధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోరారు.