Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిందు సేద్యం ముద్దు...
- డ్రిప్ట్ ఇరిగేషన్ వ్యవసాయం వలన రైతులకు లాభం
- అసిస్టెంట్ డైరెక్టర్ ఆప్ అగ్రికల్చర్ తాతారావుతో నవతెలంగాణ
నవతెలంగాణ-మణుగూరు
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక పరినామాలు అభివృద్ధి చెందినదని అసిస్టెంట్ డైరెక్టర్ ఆప్ అగ్రికల్చర్ తాతారావు అన్నారు. మంగళవారం ఆయన నవతెలంగాణతో ముఖాముఖిలో మాట్లాడారు. ఇతర దేశాల్లో తక్కవ పెట్టుబడితో అధిక ఉత్పత్తిని సాధిస్తున్నాయి. భారత దేశంలో అధునీక వ్యవసాయ పనిముట్లు అచరణలోకి వచ్చిన రైతులు మాత్రం సంప్రదాయ వ్యవసాయాన్నే కొనసాగిస్తున్నారు. వర్షాల కోసం ఎదురు చూడడం, రైతులు అప్పులపాలు కాకుండా వుండాలంటే బిందు సేద్యం ద్వారానే సాధ్యం అవతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంపూర్ణ ఆహారం అందించేందుకు సన్నాలు, పప్పుధాన్యలు పంటలను ప్రోత్సహిస్తుందని దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తుందని నియోజకవర్గంలోని రైతులందరికీ రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
వేసంగి ధాన్యం కొనుగోలు ముగిశాయా..?
ఏడీఏ : నియోజకవర్గంలోని వేసంగి పంట ద్వారా వచ్చిన ధాన్యం వందశాతం అమ్ముడుపోయిందని, బుర్గంపహాడ్ మండలంలో లకీëపురం గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన బాయిలర్ రైస్ మిల్లు కు ధాన్యం అమ్మకాలు చేయడం జరిగిందన్నారు.
ఖరీఫ్ సీజన్లో మీరు ఇచ్చే సూచనలు ఏమిటి..?
ఏడీఏ : నియోజకవర్గంలోని రైతులు వ్యవసాయ అధికారుల సహాయ, సహాకారాలు లేకుండా వ్యవ సాయం చేయరాదన్నారు. రైతు వేదిక ద్వారా ప్రతి రైతు సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. సాంబ మసూరి, జగిత్యాల సంబంధించిన ఐదు రకా ల సన్నాలు, బాపట్ల (బిపిటి) చెందిన రకాలను మాత్ర మే రైతులు ఉపయోగించుకోవాలన్నారు. పుప్పు ధాన్యాల్లో కంది పంటకు అధిక ప్రధాన్యత ఇవ్వాలన్నారు.
విత్తనాలు ఎవరి వద్ద కొనాలి..?
ఏడీఏ : ప్రభుత్వం అందించే సహాకార సంఘాలు, అదరైజేడ్ గల కంపెనీల విత్తనాలు, అధీకృత వ్యవసాయ లైసెన్స్ కల్గిన డీలర్ దగ్గర తీసుకోవాలన్నారు. ఇవి ఎవరి వద్ద తీసుకున్నా నఖీలి విత్తనాలు అవుతాయి. బిల్లులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయరాదు. స్టాక్ రిజిస్టర్, స్టాక్ బోర్టు అప్డేట్ చేయాలని డీలర్లకు సూచించారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి ఎలా సాధించాలి..?
ఏడీఏ: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సుక్ష్మ సేద్యం, బిందు సేద్యం (డ్రిప్ట్ ఇరిగేషన్ ) ద్వారా తక్కువ పెట్టుపడులతో వ్యవసాయం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా మన రైతులు మూడు వంతుల ఉత్పత్తి ఎక్కువ సాధించడం జరుగుతుందన్నారు. దీంతో సమయం వృదా కాదు, నాలుగు బస్తాలు వేసే రసాయన ఎరువులు బదులు నాలుగు కేజీలు సరిపోతుంది. దీని కారణంగా రైతు ఆర్ధికంగా నష్టపోతారు. ఈ విధానం ఉపయోగిస్తే ఎరువులు డైరెక్టట్గా పంట వేర్లకు అంది బలం చేకురుతుంది. ఇజ్రాయిల్, జపాన్, ఉత్తర కోరియా, చైనా వంటి దేశాలు ఈ విదానాన్ని పాటిస్తున్నాయి. నియోజకర్గంలోని ధనిక రైతులు ఒకటి, రెండు ఎకరాల్లో డ్రిప్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండించి అధిక ఉత్పత్తి సాధించే విధానాన్ని చిన్న, సన్నాకారు రైతులకు ఉత్సహాన్ని నింపి ప్రోత్సహించాలి.