Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఔదార్యం చాటుకున్న శ్రీ లక్ష్మిసాయిజ్యూలరీ యజమాని నాగేశ్వరావు
నవతెలంగాణ-భద్రాచలం
సీపీఐ(ఎం) నాయకత్వంలో వివిధ స్వచ్ఛంద సంస్ధల సహాకారంతో బండారు చందర్రావు ట్రస్టుకు మంగళవారం ప్రముఖ బంగారు ఆభరణాల వ్యాపారి శ్రీలక్ష్మిసాయి జ్యూలరీ యజమాని చిట్టిమెరీజు నాగేశ్వరరావు రూ.10వేలు విరాళం అందజేశారు. కరోనా ఐసోలేషన్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా పేషెంట్లకు చాల మంచి సేవలు అందిస్తున్నారని తెలిపారు. కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు చేయటం ద్వారా సీపీఐ(ఎం) నాయకులు బీసీఆర్ ట్రస్టు చేస్తున్న సేవలు వెలకట్టలేమని అన్నారు. ట్రస్టు సేవలకు తనవంతు తోడ్పాటుగా నాగేశ్వరరావు 10వేలు విరాళాన్ని ట్రస్టు నిర్వహకులు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌కు అందజేశారు. బీసీఆర్ ట్రస్టుద్వారా తాము చేస్తున్న సేవకు పెద్దలు, ప్రముఖులు, వ్యాపారులు తోడ్పాటును అందిస్తున్నారని వారందరికి ట్రస్టు తరుఫున రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు గడ్డం స్వామి, కె.బ్రహ్మాచారి, యం.బీ.నర్సారెడ్డి, యం.రేణుక, బండారు శరత్ బాబు, వ్యాపారి బచ్చు శ్రీనివాస్, బాలదుర్గా శ్రీను, బి.వెంకటరెడ్డి, నాగరాజు, ఫిరోజు, డి.లక్ష్మి గంగా పాల్గొన్నారు.