Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) హెల్ప్‌లైన్, మున్సిపల్ చైర్మెన్
- దమ్మాలపాటి ఆధ్వర్యంలో అంత్యక్రియలు
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని 16 వార్డుకు చెందిన టైనిటాల్ స్కూల్ వ్యవస్థాపకులు, పెద్దమ్మ గుడి పూజారి ఖండ్రిక వెంకట రమణ (56) సోమవారం రాత్రి కరోనాతో మృతి చెందారు. గత పది రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతూ ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ నందు మృతి చెందారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎం) హెల్ప్‌లైన్ సభ్యులు అబ్దుల్ నబీ, తాళ్ళురి కృష్ణ తదితరులు హిందూ స్మశాన వాటిక నందు దహన సంస్కారాలకు ఏర్పాటు చేసి దగ్గరుండి కుటుంబ సభ్యులతో కలిసి అంతక్రియలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.... ఖండ్రిక వెంకట రమణ మరణం తీవ్రంగా కలచి వేసిందన్నారు. స్కూల్ కరస్పాండెంట్‌గా 20 సంవత్స రాలు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గురువులుగా ఆయన పేరు ప్రఖ్యా తలు తెచ్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, 18 వార్డ్ కౌన్సిలర్ పాబోలు స్వాతి కిరణ్, 16 వార్డు కౌన్సిలర్ రజితరవి, సీపీఐ(ఎం) హెల్ప్‌లైన్ సభ్యులు అబ్దుల్ నబీ, కృష్ణ పాల్గొన్నారు.