Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర తొలి పీఆర్సీలో వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీన్ని వెంటనే సవరించి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచి న్యాయం చేయాలని ఐక్య వేదిక డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతూ తేదీ 11 జూన్ 2021న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అందులో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి జీవో 60 విడుదల చేశారు. ఇందులో గతంలో మాదిరిగానే మూడు స్లాబ్లు పెట్టారు. రూ.15600-19500-22750గా వేతనాలు నిర్ణయించి అన్యా యం చేశారని వాపోయారు. ఒకవైపు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు మీద గౌరవం లేకుండా వాటిని తుంగలో తొక్కి అరకొర వేతనాలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. అన్ని యూనియన్లను అసోసియేషన్లను కలుపుకుని, ఉద్యోగులందరినీ సమీకరించి వేతనాలు పెరిగే వరకు రెగ్యులర్ అయ్యేవరకు దశలవారీ ఆందోళనలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇల్లందు : సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ఎదుట పైసలు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హెల్త్ మిషన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, ఎక్స్గ్రేషియా, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.
గుండాల : వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైద్య సిబ్బంది మంగళవారం ఐక్యవేదిక తరఫున నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేషనల్ హెల్త్ మిషన్లో పని చేస్తున్నా ఉద్యోగులందరికీ పీఆర్సీ వర్తింపజేయాలని, ఆశా కార్యకర్తలకు రూ.10వేలు రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రవిచంద్, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీస్ట్, ఆశా కార్యకర్తలు, ఎన్హెచ్ఎం ఉదోగులు పాల్గొన్నారు