Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ప్రభుత్వ సాయం కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సత్వరమే ఆర్ధిక సాయం అందేలా ఎంపీ నామ ప్రత్యేక చొరవతో చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఖమ్మం కార్పొరేషన్, కూసుమంచి, నేలకొండపల్లి, కామేపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎంపీ నామ చొరవతో మంజూరైన రూ.8,57,500 విలువైన 16 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి కనకమేడల సత్యనారాయణ, చిత్తారు సింహాద్రి యాదవ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వాకదాని కోటేశ్వరరావు (ఖమ్మం), కూసుమంచి మండల నాయకులు రషీద్, వీరవెల్లి వెంకన్న, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, సరిపూడి గోపీ, మునిగంటి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.