Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నేటి నుండి ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయాన్ని రైతుల ఎక్కౌంట్లో జమ చేయడం జరుగుతుందని రైతు బందు సమితి మండల అధ్యక్షుడు బత్తుల శోబన్ బాబు అన్నారు. మంగళవారం నర్సాపురం రైతు వేదిక భవనంలో క్లస్టర్ పరిధిలోని చంద్రశేఖర్ రావు చిత్ర పటానికి పాలతో అభిషేకం నిర్వహించి, మాట్లాడారు. ఈ కార్యక్రమం లో భద్రాచలం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూజారి సూర్యచందర్ రావు, బండారుగూడెం, డబ్య్లుఎల్ రేగుబల్లి, రామారావు పేట సర్పంచ్లు వెంకటేశ్వర్లు, పూజారి మోహన్రావు, పార్వతి, ఏఈఓ అలేఖ్య, రైతు బందు సమితి సభ్యులు శ్రీను పాల్గొన్నారు.
మణుగూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును ఖాతాల్లో జమచేసినందుకు టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ విజయకుమారి, పీఏసీఎస్ చైర్మెన్ కుర్రి నాగేశ్వరరావు, టౌన్ అధ్యక్షులు అప్పారావు, మండల అధ్యక్షులు ముత్యంబాబు, మోహన్రావు, కెవి.రావు తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : రైతు బందు నిధులు రైతుల ఖాతాలో వేసినందుకు మండల పరిధిలోని భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రైతు వేదిక ప్రాంగణంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ రేగా కాళిక, పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద రామలింగం, అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీనువాసు రెడ్డి, నేతాజీ, రేగాసత్యనారాయణ, భాస్కర్, శ్రీనువాసు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.