Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రి హెల్పింగ్ హ్యాండ్స్ సేవలు గర్వించతగ్గవి
- ఇస్రో శ్రీహరి కోట యువ శాస్త్రవేత్త జక్కుల సాయి తేజ
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా బారిన పడిన వారికి భద్రాద్రి హెల్పింగ్ హ్యాండ్స్ వారు అందిస్తున్న సేవలు గర్వించతగ్గవని ఇస్రో శ్రీహరి కోట యువ శాస్త్రవేత్త సాయి తేజ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ పంచాయతీ ఇందిరా నగర్ కాలనీ అంగన్వాడీ పాఠశాలలో 22 వ రోజు భద్రాద్రి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమంలో శ్రీహరి కోట సతీష్ ధావన్ అంతరిక్ష సంస్థ ఎగ్జిక్యూటివ్ యువ శాస్త్రవత్త జక్కుల సాయి తేజ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. భద్రాద్రి హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు గడచిన మూడు వారాలుగా కరోనా కష్ట కాలంలో మానవీయ సంబంధాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో మానవత్వ పరిమళాలను పంచుతూ కరోనా కుటుంబాలను పరామర్శించి 250 భోజన ప్యాకెట్లను ప్రతి రోజు పంపిణీ చేయడం పట్ల అభినందనలు తెలిపారు. భద్రాద్రి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సేవల్లో తాము సైతం భాగస్వాములం అవుతామని కరోనాను తరిమి కొడుతూ బాధితుల్లో మనోధైర్యంను పెంచుతున్నారని నిర్వాహ కులను అభినందించారు.
యువ శాస్త్రవేత్త సాయి తేజ కు ఘన సన్మానం
కొత్తగూడెంలో పుట్టి, పెరిగి కష్టపడి చదువు కొని శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో శాస్త్ర వేత్తగా ఉన్నత పదవిని చేపట్టిన జక్కుల సాయి తేజను భద్రాద్రి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిజేఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లెల రామనాధం, దిశ కమిటీ సభ్యులు మందపల్లి ఉమ, సిడిపీఓ కనక దుర్గ, భద్రాద్రి హెల్పింగ్ హాండ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ లగడపాటి రమేష్ చంద్ర, సమన్వయ కర్త షేక్ దస్తగిరి, వర్కింగ్ సెక్రెటరీ గుండపునేని సతీష్, పగడాల చందూ, భావ్ సింగ్, వాలంటీర్లు సతీష్, సంపత్, ఉపేందర్, మల్లికార్జున్, ఓదెలు, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.