Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
టేకులపల్లి మండలానికి 51.2 క్వింటాల కంది విత్తనాలు జాతీయ ఆహార భద్రతా మిషన్ ద్వారా మంజూరైన వచ్చాయి. వీటిని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో గల రైతు వేదిక భవనంలో పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. భూసారం, పెరుగుదల, పంట మార్పిడి, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచుటకు జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. వరి గింజలు ఎదబెట్టుట, డ్రమ్ సీడర్ ద్వారా విత్తుట వలన రైతుకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏడిఏ వాసవి రాణి, ఏవో అన్నపూర్ణ, ఇల్లందు మార్కెట్ యార్డ్ చైర్మన్ భానోత్ హరి సింగ్, వైస్ చైర్మన్ లాల్ సింగ్, గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు బంధు జిల్లా సభ్యులు మాధవరావు, సర్పంచులు మాలోతు సురేందర్, రాజేందర్, లావణ్య శంకర్, ఎంపీటీసీలు ఉండేటి ప్రసాద్, భూక్య బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏకలవ్య భవన నిర్మాణం పనులను పరిశీలన ఎమ్మెల్యే
టేకులపల్లి మండలంలోనీ బద్దుతండా గ్రామపంచాయతీలో కేంద్ర నిధులతో నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల నిర్మాణ పనులను, నిర్మాణ స్ట్రక్చర్‌ను ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ బుధవారం పరిశీలించారు. త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు. కరోనాతో కోలుకున్న బద్దుతండా ఎంపీటీసీ ఉకే రామకృష్ణ పరామర్శించి పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బర్మావత్ లాల్‌సింగ్ నాయక్, టేకులపల్లి టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, బోడా బాలు, దాసుతండా ఎంపీటీసీ భూక్య బాలక్రిష్ణ,జాటోత్ నరేష్ నాయక్, ఈసం చంటి, తదితరులు పాల్గొన్నారు.