Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్లు
మణుగూరు : సింగరేణి కాలరీస్ కార్మికులకు మెగాహెల్త్ క్యాంపు ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ త్వరతగతిన పూర్తి చేయాలని డైరెక్టర్స్ ఆపరేషన్ ఎస్.చంద్రశేకర్, డైరెక్టర్ పైనాన్స్ ఎస్.బాలరామ్ సూచించారు. మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ గారితో జీఎం కార్యాలయంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. మణుగూరు ఏరియాలో 53శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం జీఎం జక్కం రమేష్ మాట్లాడుతూ... తొలి రోజు అధిక సంఖ్యలో ఉద్యోగులు వచ్చినప్పటికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు, వైద్య, ఆరోగ్య విభాగ బాధ్యులు చక్కటి సమన్వయంతో పనిచేశారని అభినందించారు. మూడు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు బి. లలిత్‌కుమార్, వెంకటేశ్వర్లు, మేరికుమారి, శేషగిరిరావు, సురేష్, కె. వెంకట్రావు, ఎస్.రమేష్, సాయిల సురేష్ తదితరులు పాల్గొన్నారు.