Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రక్రియను వేగవంతం చేయాలి : ప్రజల డిమాండ్
నవతెలంగాణ-ఎర్రుపాలెం
కరోనా వైరస్ గ్రామాలలో విజృంభిస్తు విలయ తాండవం చేస్తున్నా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు, నెలరోజుల పైబడి వ్యాక్సిన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నామని ప్రజలు వాపోతున్నారు, కరోనా కట్టడి కోసం మండల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ తమ వంతు కృషి చేస్తున్నా మండలంలోని వివిధ గ్రామాలలో ప్రతిరోజు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి, సోమవారం నాటికి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మొత్తం 280 పాజిటివ్ కేసులు ఉన్నాయని మండల అభివద్ధి అధికారి రామకృష్ణ తెలిపారు, ఎర్రుపాలెం మండలంలో 31 గ్రామ పంచాయతీలకు గాను 36 గ్రామాలు ఉండగా సుమారు 55 వేల పైబడి జనాభా కలిగి ఉన్న మండలంలో ఇప్పటికీ 3980 మందికి తొమ్మిది శాతం ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ అందించారు, మొదటి డోసు వేసుకొని రెండో రోజు కోసం 2363 మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు, యాభై వేల పైబడి మండలంలో ఉన్న జనాభాకి సుమారు నాలుగు వేల మందికి మాత్రమే వ్యాక్సిన్ అందిస్తే ఎదురు చూస్తున్నా మిగిలిన జనాభా కి వ్యాక్సిన్ ఏనాటికి అందిస్తారో అర్థం కావటం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ నెల 21వ తారీకు నుండి కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని మోడీ ప్రకటించారు, ప్రజలందరికీ ఏనాటికి వ్యాక్సిన్ అందుతుందో అర్థం కావటం లేదని అసలు వ్యాక్సిన్ వేసుకొని వారు మొదటి డోసు కోసం మొదటి డోస్ వేసుకున్న కొద్దిపాటి జనాభా రెండో రోజు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు, ఈనెల 18వ తారీకు నాటికి మొదటి డోసు వేసుకున్నావారు రెండో డోస్ కి అర్హులు అవుతారని వైద్య అధికారులు తెలిపారు, ప్రభుత్వాలు వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు,