Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబోదిబోమంటున్న రైతులు
- రైతులకు నష్టం జరగకుండా చూడాలి: రైతు సంఘం
నవతెలంగాణ-వైరా
ఆరుగాలం కష్టించి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయటంలోనే నెలల తరబడి జాప్యం జరిగిపోయింది. అకాల వర్షాలతో ధాన్యం రాశులు తడిపినవి. కాటా వేసిన ధాన్యం బస్తాల తరలింపు కూడా ఆలస్యం కావడంతో తడిసిన బస్తాల్లోంచి మొక్కలు బయటకు వచ్చి రైతును ఎక్కిరిస్తున్నవి. వారం రోజుల్లో రైతు సమస్యను తీరుస్తానన్న వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ హామీ కూడా అసంపూర్తిగానే మిగిలింది. గరిక పాడు సొసైటీ పరిధిలో 3695 క్వింటాళ్లతో సహా మొత్తం మండలంలో 27,440 క్వింటాళ్ల ధాన్యాన్ని పెద్దపల్లిలోని భవాని రైస్ ఇండిస్టీకి తరలించారు.కాని ఇప్పుడు ఆ రైస్ ఇండిస్టీ సివిల్ సప్లై జాబితాలో లేదని ఆలస్యంగా కళ్ళు తెరిచారు. ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ అజరు కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు, ఆయన వెంటనే జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. సివిల్ సప్లై జాబితాలో లేని, వైరాకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపల్లిలోని భవాని రైస్ ఇండిస్టీకి ధాన్యం తరలించిన అధికారుల నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించకుండా, సివిల్ సప్లై జాబితాలో లేని రైస్ మిల్ యాజమాన్యం ఇన్ని వేల క్వింటాళ్ల ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? అన్న విషయం గ్రహించ కుండా ఎలా ఉన్నది? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నవి.అర్హత లేని మిల్లులకు ధాన్యం తరలించి గతం లో కూడా రైతులను నిండా ముంచిన సంఘటనలు ఉన్నవి.అట్టి మిల్లులను సీజ్ చేయటం తప్ప జిల్లా అధికార యంత్రాంగం చేయగలిగింది లేదు. ఇటువంటి అనుభవాలు వైరా రైతులకు, మిల్లర్లకూ ఉన్నవి. ఇప్పుడు రైతుకు జరిగిన నష్టాన్ని గుర్తించకుండా, సమస్యను ఏదో సాధారణ సమస్యగా దాటవేసే ప్రయత్నంలో ''రైతు పక్షపాతి మంత్రి'' స్పందించి న విషయాన్ని తెరపైకి తెచ్చారని రైతులు విమర్శిస్తున్నారు. 27,440 క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుకు రూపాయి నష్టం లేకుండా సమీపంలోని సివిల్ సప్లై జాబితాలో ఉన్న మరో రైస్ మిల్కు తరలించి పరిష్కరిస్తారా? లేక భవాని రైస్ ఇండిస్టీని తక్షణం సివిల్ సప్లై జాబితాలో చేర్చి రైతుకు రావాల్సిన రూ 5.12 కోట్ల రూపాయలను గరిక పాడు సొసైటీ ద్వారా ఇప్పిస్తారా అన్నది జిల్లా సివిల్ సప్లై అధికారుల ముందున్న సమస్య. ఇప్పటికే రైతులు ఎన్నో విధాలుగా మోసపోయారు, నష్టపోయారు. రైతు నుండి తరలించుకు పోయిన ధాన్యంకు ఆ గతి పడితే, ఇంకా డిసిఎంఎస్, ఐకేపి వైరా విశాల సహకార పరపతి సంఘం ఆద్వర్యంలో కాటాలు వేయాల్సిన ధాన్యం, కాటా లు వేసిన ధాన్యం బస్తాల తరలింపు ఇప్పట్లో అయ్యేలా లేదు.వారం రోజుల్లో రైతుల సమస్య పరిష్కారం చేస్తానన్న వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ హామీ నెరవేరలేదు. వైరా మండలంలో మార్కెట్ యార్డ్ గోదాముల్లో, తాటిపూడి సివిల్ సప్లై గోదాముల్లో ఎక్కడినుండో వస్తున్న ధాన్యాన్ని నిల్వకు అనుమతి ఇస్తున్న అధికారులు రైతులకు అవకాశం ఇవ్వనందుకు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేసినా గోదాముల్లో రైతుకు స్థానం దొరకలేదు. సివిల్ సప్లై జాబితాలో లేని భవాని రైస్ ఇండిస్టీకి ధాన్యం తరలించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని, ధాన్యం రైతులకు నష్టం జరక్కుండా వెంటనే డబ్బు చెల్లించాలని రైతులు ,రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది.వారు రెండో డోస్ కి అర్హులు అవుతారని వైద్య అధికారులు తెలిపారు, ప్రభుత్వాలు వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు,