Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారం విజయవంతం చేయాలి
- జిల్లా కలెక్టర్ డి.అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7వ విడత హరితహారం కార్యక్రమంలో 1కోటి 5 లక్షల మొక్కలు నాటేందుకు శాఖల వారిగా లక్ష్యాన్ని కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. హరితహరం, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు, పల్లె, పట్టణ ప్రగతి, అంటువ్యాధులు నియంత్రణ చర్యలు, వాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.481 గ్రామ పంచాయతీల్లో 90,29, 211, నాలుగు మున్సిపాల్టీల్లో 14,68,017 మొక్కలు నాటేందుకు శాఖల వారిగా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. గతంలో నాటిన మొక్కల్లో చనిపోయిన వాటిని గుర్తించి తిరిగి మొక్కలు నాటు విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలకు ప్రహరిగోడలకు బదులుగా బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి కార్యాలయాను పరిశుభ్రం చేయడంతో పాటు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠ ధామాలు సహా అన్ని అంశాల్లో జరుగుతున్న పనులకు సంబంధించి సమగ్ర నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు పాల్వంచ మండలం, లక్ష్మీదేవిపల్లి గ్రామంలో స్థలకేటాయింపు చేయడంతో పాటు నివేదికలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఈ సీజన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గత 3 మూడు సంవత్సరాల్లో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా కేసులు ప్రబలిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిభిరాలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్, డిఆర్డీఓ అశోక్ చక్రవర్తి, డిఆర్డిఓ పీడి మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీకాంత్, శ్రీనివాసరెడ్డి, నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయాలి-కలెక్టర్
కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా సూపర్ స్పెడర్లుకు జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్య, మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. ప్రతి రోజు నివేదికలు అందచేయాలని చెప్పారు. రోడ్లుకు ఇరువైపులా మల్టీపర్పస్ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పట్టణాల్లో జరుగుతున్న డివైడర్ పనులు, జంక్షన్లను అందంగా తీర్చిదిద్దు చర్యలు 5 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. రహదారుల వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించాలని చెప్పారు. సమీకృత కలెక్టరేట్ ప్రాంగంణంలో అందమైన మల్టీ పర్పస్ మొక్కలు నాటాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, డీపీఓ రమాకాంత్, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లందు మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీకాంత్, నాగప్రసాద్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.