Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి బుగ్గవాగు ప్రక్షాళన ప్రారంభం
- కాంక్రీట్‌తో సైడ్‌వాల్ నిర్మిస్తే పరిష్కారం..!
- శాశ్వత నిర్మాణ చర్యలు చేపడతాం : చైర్మన్ దమ్మాలపాటి
నవతెలంగాణ-ఇల్లందు
గత సంవత్సరం ఇల్లందు పాలకవర్గం బుగ్గవాగు ప్రక్షాళన కోసం రూ. 11 లక్షలు ఖర్చు చేసింది. ముగ్గులోని నాచు మొక్కలు చెట్లు ముళ్ళ పొదలు రాళ్ళు రప్పలు తొలగించారు. ప్రక్షాళన చేసి ఇల్లందు పట్టణానికీ దుర్వాసనా దోమల బెడద, వరదల ముప్పు నుండి కాపాడడారు. ఏడాది కాలం గడిచే సరికి మళ్లీ యథాస్థితికి చేరుకుంది. మళ్లీ పాత కథే. పిచ్చి మొక్కలు నాచు, పొదలు, వ్యర్ధ పదార్థాలు తయారయ్యాయి. దుర్వాసన విపరీతంగా పెరిగింది. ఈ సంవత్సరం కూడా వర్షాకాలం అంటు రోగాలు ప్రబలకుండా ముందస్తు చర్యలలో భాగంగా బుగ్గవాగు పక్షాన పనులు బుధవారం పాలకవర్గం చేపట్టింది. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తుండటంతో బుగ్గవాగు ప్రక్షాళనకు మరో ప్రస్తుతానికి రూ. 5 లక్షలు టెండర్లు పిలిచి బుధవారం పనులు ప్రారంభించారు. ఏటా లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ మళ్లీ యధాస్థితికి వస్తోంది. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున బుగ్గవాగు ఉంది. కాంక్రీట్ బేస్డ్ సైడ్ వాల్స్ నిర్మించి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపడితే సమస్య తీరుతుందని ప్రజలు అంటున్నారు.
ఈ విషయమై మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు నవతెలంగాణతో మాట్లాడుతూ బుగ్గవాగు సమస్యపై శాశ్వత నిర్మాణాల ప్రాతిపదికన ప్రపోజల్స్ పంపించామని తెలిపారు. కోవిడ్ ఎఫెక్ట్ మూలంగా కార్యరూపం దాల్చలేదని అన్నారు.