Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగులో దేశానికే ఆదర్శం
- విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎంఎల్ఏ హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
దేశానికి వెన్నెముఖ రైతని వారి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తోందని ఎంఎల్ఏ హరిప్రియ అన్నారు. మండలంలోని హన్మంతులపాడు రైతు వేదిక భవనంలో బుధవారం రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వరి సాగులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు బంధు ద్వారా వర్షాకాల సీజన్లో రైతులకు పెట్టుబడి సాయంగా మంలంలో 10,310 మంది రైతులకు రూ.15 కోట్ల 30లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతోందన్నారు. కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల వల్ల కూడా రాష్ట్రంపై ఆర్థికభారం పడినప్పటికీ రైతన్నకు ఎటువంటి ఆర్థిక భారం పడకుండా రైతు బంధు కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం అనేది గర్వించదగిన విషయం అని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ, జిల్లా గ్రంథాలయ సంస్థల అద్యక్షులు హరి సింగ్,దిండిగాల.రాజేందర్ ,వైస్ చైర్మన్ లాల్ సింగ్,జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు పులిగండ్ల మాధవరావు,ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, సుదిమల్ల సర్పంచ్ కల్తీ పద్మ, వ్యవసాయ శాఖ ఎడిఓ వాసవి రాణి, ఏఓ పి.సతీష్, ఏఈఓలు శృతి, యశ్వంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.