Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాం
- డీసీఎంఎస్ చైర్మన్ రాయల
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ ప్రభుత్వం రైతులు దళారుల భారిన పడకుండా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలులో ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లా తెలంగాణాలోనే మొదటిది అని ఉమ్మడి ఖమ్మం జిల్లా సహకార మార్కెటింగ్ శాఖ (డీసీఎంఎస్) చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు అన్నారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్, పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు కలిసి పాత పాల్వంచలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ డీసీఎంఎస్ ద్వారా వేసవి సీజన్లో 30 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు సుమారు 4 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని త్వరలోనే ధాన్యం సేకరణను నిలిపివేయనున్నామన్నారు. డీసీఎంఎస్ ద్వారా వాణిజ్య వ్యాపార రంగాల్లో కూడా పని చేయనున్నామన్నారు. నాబార్డు వారి సహకారంతో డీసీఎంఎస్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పారా బాయిల్డ్ రైస్ మిల్లులు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును కలిసామని, సోషల్ వెల్ఫేర్, రెసిడెన్సియల్ పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు సమకూర్చే ఆహార సామాగ్రి, దుప్పట్లు, బెడ్ లు సరఫరా డీసీఎంఎస్కు అప్పగించాలని కోరామన్నారు. డీసీఎంఎస్కు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఉన్న ప్లాట్లలో గోడౌన్ ల నిర్మాణాలు చేపట్టనున్నమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీసీఎంఎస్కు రోడ్డు భవనాల శాఖ ద్వారా బిల్డింగ్ కేటాయించారని, త్వరలో కార్యాలయాన్ని ప్రారంభిచనున్నామన్నారు. డీసీఎంఎస్ను విధాలా అభివృద్ధి చేయటమే పాలకవర్గ ద్యేయమని రాయల అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.