Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
కని పెంచి పెద్దచేసిన తండ్రినే ఓ కొడుకు హత్యచేసిన సంఘటన మండల పరిధిలోని ఎంవీపాలెంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాలిలా ఉన్నాయి... ఎంవీపాలెం గ్రామానికి చెందిన కొలిచలం రామచంద్రయ్య(70), లక్ష్మీదేవమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.చిన్న కుమారుడు ఉమాశంకర్‌కు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఉమాశంకర్ భార్యభర్తల మధ్య ఘర్షణలు జరిగి వేరువేరుగా ఉంటున్నారు.తల్లిదండ్రుల వల్లనే తన భార్య కాపురానికి రావడం లేదని రోజూ తల్లిదండ్రులతో గొడవపడుతూ ఉండేవాడు. ఇదే విషయమై గ్రామ పెద్దలు కూడా పలుమార్లు పంచాయితీ చేసి ఉమాశంకర్‌ను మందలించారు. అయినా ఉమాశంకర్ తీరు మారలేదు. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఉమాశంకర్ ఇంటికి వచ్చి ఆరుబయట పడుకున్న తల్లిదండ్రులతో ఘర్షణకు దిగాడు.తండ్రితో ఘర్షణ పడుతుంటే తల్లి అడ్డురాగ చంపుతా అని బెదిరించడంతో తల్లి కేకలు వేసుకుంటూ చుట్టు పక్కల వారిని పిలిచేందుకు వెళ్లింది. ఈలోగా మంచంపై పడుకున్న తండ్రిని లాగి కిందపడేసి మెడుకు టవల్ చుట్టి తలను కింద బండకేసి కొట్టాడు.తీవ్ర రక్త స్రావం జరిగి రామచంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే రామచంద్రయ్య మృతిచెందాడు. దీంతో ఉమాశంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ తరలించారు. మృతుని పెద్ద కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవుఫ్ తెలిపారు.