Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్, కమిషనర్లకు సిఐటియు వినతి
నవతెలంగాణ-గాంధీచౌక్
జీ.వో యం.ఎస్.నెం. 63ని అనుసరించి, జీ.వో నెం. 60లో పేర్కొన్న వేతనాలను కేటగిరిలవారిగా పెంచి 2021 జూన్ నెల నుండే అమలు చేసి, జూలై నెల మొదటి వారంలో చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్ పి. నీరజ, కమిషనర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో పారిశుధ్య కార్మికులు, జవాన్లు, అటెండర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రిసియన్లు, పార్క్ కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మరియు ఇతర కేటగిరీలు, ఆఫీసు నిర్వహణలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. వీరికి 11వ పి.ఆర్.సి కమిషన్ చైర్మన్ చేసిన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రి వర్గం చర్చించి వేతనాలను రూ.15600/-లు, రూ.19500/-లు, రూ.22,750/- రూపాయలుగా నిర్ణయించి జీవో. యం.ఎస్.నెం. 60ని తేది: 11.06.2021న విడుదల చేశారన్నారు. ఆ తరువాత జీవో యం,ఎస్.నెం. 630 తేది: 15, 06.2021 న విడుదల చేస్తూ, వివిధ కేటగిరిలకు ఎలా అమలు చేయాలో విధి విధానాలు నిర్ణయిస్తూ జీ.వో. నెం.60లో పేర్కొన్న వేతనాలను మునిసిపల్ సిబ్బందికి కేటగిరీల వారిగా 2021జూన్ నెల నుండే అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల కమీషనర్లను ఆర్ధిక శాఖ ఆదేశించించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.వో.నెం. 60 ప్రకారం పారిశుధ్య కార్మికులు, పార్క్ కార్మికులు, అటెండర్లకు నెలకు రూ. 15600/-లు, డ్రైవర్లు, జవాన్లు, ఎలక్ట్రిసియన్లకు రూ. 19500/-లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు రూ. 22,750/- రూపాయలుగా మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు వర్తిస్తాయన్నారు. కావున జీ.వో యం.ఎస్.నెం. 63ని అనుసరించి, మన మున్సిపాల్టీ/ కార్పోరేషన్లో జీ.వో నెం. 60లో పేర్కొన్న పెరిగిన వేతనాలను కేటగిరిల వారిగా పెంచి 2021 జూన్ నెల నుండే అమలు చేసి జూలై నెల మొదటి వారంలో వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జినక శ్రీను, నాయకులు దొడ్డ నరసింహ రావు,బుర్రి ఉపేందర్, వెంకటరమణ,జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.