Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20వ తేదీ తరువాత సీఎం ఆకస్మిక తనిఖీ
- ఉమ్మడి జిల్లా పల్లె, పట్టణ ప్రగతిపై మంత్రి పువ్వాడ అజరు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టణ, పల్లెప్రగతి ద్వారా గుణాత్మక మార్పును తీసుకొచ్చామని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లా, మండల స్థాయి అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేసి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. మొదటి విడత పట్టణ, పల్లెప్రగతి, హరితహారం లక్ష్యసాధన, రెండో విడత పల్లె ప్రగతి, 7 వ విడత హరితహారం సన్నద్ధంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో గురువారం భక్తరామదాసు కళాక్షేత్రంలో మంత్రి సమీక్షించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లెప్రగతి ద్వారా పట్టణాలు, నగరాలు, పల్లెల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించుకున్నామ న్నారు. గత పల్లె ప్రగతిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకున్నా.. కొన్ని గ్రామాలలో పనులు పెండింగ్ ఉన్నాయన్నారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, కంపోజ్ షెడ్స్, పల్లె ప్రకతి వనాలు మిగులు పనులన్నీ వారం రోజులలోపు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో పాటు మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, ఎంపిఓలు తప్పనిసరిగా పల్లె నిద్ర చేసి గ్రామాలలో పారిశుధ్య పనులను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ నెల 20 వ తేదీ తర్వాత సీఎం జిల్లాల పర్యటన ఉంటుందన్నారు. ప్రధానంగా పల్లె ప్రగతి పనులు ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు కార్యస్థానంలో తప్పని సరిగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఖమ్మం జిల్లాలోని సింగరేణి, కామేపల్లి, తిరుమలాయ పాలెం, ఏన్కూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్ళపల్లి, పినపాక, జూలూరుపాడు, ఆశ్వారావుపేట, టేకులపల్లి మండలాలలో పల్లెప్రగతి పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాటిని వారంరోజులలోపు పూర్తి చేయా లని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, వైరా, ఇల్లెందు శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, హరిప్రియ, పట్టణ, పల్లె ప్రగతి, హరితహారం సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఖమ్మం కలెక్టర్ కర్ణన్, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్లు సూతగాని జైపాల్, కె.మహేష్, మొండితోక లత, దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, కాపు మహాలక్ష్మి, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారులు ప్రియాంక, విద్యాలత, జిల్లా పంచాయతీ అధికారులు, ప్రభాకరరావు, రమాకాంత్, జిల్లా అటవీ శాఖాధికారులు బి.ప్రవీణ, రంజిత్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా,మాలతి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.