Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
బివికె ఐసోలేషన్ సెంటర్‌కి గురువారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో 25కేజీల బియ్యం విరాళంగా ఇవ్వటం జరిగింది. ఈ బియ్యం డివైఎఫ్ఐ నాయకులు రణం మధు అందజేశారు. బివికె ఐసోలేషన్ సెంటర్ పని, డివైఎఫ్ఐ వాలంటీర్లు చేస్తున్న పనిని చూసి తాను కూడా ఈ పనిలో భాగస్వామ్యం కావాలని ఈ చిరు సహయం చేసినట్లు మధు తెలియజేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ మాట్లాడుతూ డివైఎఫ్ఐ వాలంటీర్లు సర్వీస్ చేయడంతో పాటు, విరాళాలు కూడా ఇవ్వటం అభినందనీయమని ఆమె అన్నారు. డివైఎఫ్ఐ స్పూర్తితో యువత కరోనా సేవలో ముందండాలి అని ఆమె అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, బివికె జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, మహిళా నాయకురాలు రమణ, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఇంటూరి అశోక్, కణపర్తి గిరి, కూరపాటి శ్రీను, గుమ్మా ముత్తారావు, కణతాల వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు నవీన్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.