Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19న ఖమ్మంలో ధర్నా
- 24న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన
- 26న అంబేద్కర్ సెంటర్లో మానవహారం
- 30న కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ప్రజలపై భారం మోపూతూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై సమరభేరి మోగించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. గురువారం నాడు సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో జరిగిన వామపక్షాల సమావేశంలో సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్, ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ఏడాదిలో 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపిందన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కరోనా సంక్షోభంతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారితే ఆదుకోకుండా భారాలు వేయటం సిగ్గుచేటన్నారు. ఒక్క నెలలోనే 25 సార్లు పెట్రో ధరలు పెంచిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. కరోనా కాలం నుండి పెంచిన పెట్రో ఛార్జీలన్నీ తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేరళ తరహాలో పెట్రోల్, డీజిల్పై రు.12, రు.10 తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకం ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఆస్తులు తెగనమ్మి ఆడంబరాలు చేయటం అభివృద్ధి చర్య కాదన్నారు. ధనిక తెలంగాణలో 4 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయో చెప్పాలన్నారు. సమావేశంలో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎస్.కె.జానీమియా తదితరులు పాల్గొన్నారు