Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ జిల్లా కమిటీ డిమాండ్
- జిల్లా పశుసంవర్థక శాఖ అధికారికి వినతి పత్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
డీడీలు తీసిన గొల్ల, కురుమలకు ప్రభుత్వం వెంటనే నగదు బదిలీ చేయాలని, జిల్లా గొర్రెలు, మేకల పెంపకం సంఘం (జిఎంపిఎస్) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గురువారం గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పశుసంవర్థక శాఖ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిఎంపిఎస్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కాసాని అయిలయ్య మాట్లాడుతూ జిల్లాలో డీడీలు తీసిన గొల్ల కురుమలకు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమల ఓటు బ్యాంక్ కోసం నమ్మ పలికి రెండోసారి అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ డీడీలు కట్టించిందని వాపోయారు. ఇప్పటికైన ప్రభుత్వం గొల్ల కురుమలకు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమలకు నచ్చిన చోట ఇష్టమైన గొర్రెలను కొనుగోలు చేసుకునే విధంగా గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని, సొసైటీ ఎన్నికలు నిర్వహించి కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని, గొర్రెలకు, మేకలకు అన్ని పశువైద్యశాలలో అన్ని రకాలుగా మందులు, వ్యాక్స్‌న్ అందుబాటులో ఉంచాలన్నారు. పశువైద్యశాలలోఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, గొర్రెల కాపరులకు ప్రమాద బీమా రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, గొర్రెలకు, మేకలకు ఉచితంగా ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్స్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు, సంఘం జిల్లా అధ్యక్షులు కొండబోయిన వెంకటేశ్వర్లు, సంఘం ఉపాధ్యక్షులు ఉదారి మల్లయ్య, సహయ కార్యదర్శి బచ్చలికూర శ్రీను తదితరులు పాల్గొన్నారు.