Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిత్యావసరాలు అందజేత
- పలువురు ప్రశంసలు
నవతెలంగాణ-పాల్వంచ
ఆపదలో ఉన్నవారికి ఆసరాగా నిలుస్తూ.. ఆకలి తీర్చి.. నిత్యావసరాలు అందిస్తూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు కరోనా బాధితులకు అండగా నిలిచి ఆపన్నహస్తం అందించి కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన మహానుబావుడు వీసంశెట్టి విశ్వేశ్వరయ్య. చిన్నతనంనుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని జీవితంలో గట్టెక్కి ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్న ఆయన కరోనా సమయంలో నిరుపేదలకు పనులు లేక తినడానికి తిండిలేక అల్లాడుతున్న వారిని చూసి చలించారు. బంధువులు, స్నేహితుల సాయంలో వారికి అండగా నిలిచి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.
కరోనా మహామ్మారి బారిన పడి ప్రజలు విలవిల్లాడుతున్నసమయంలో వీసంశెట్టి విశ్వేశ్వరరావు మానవతా దృక్పదంతో ఆలోచించి పేదల ప్రజలకు కరోనా బాధితులకు అండగా నిలవాలనే ఆలోచనలో తన మిత్రులు, బంధువుల సహాయంలో సుమారు ఏడు నుండి 8 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి 40 రోజులపాటు నిరుపేద బాధితుల ఆకలి తీర్చారు. పాల్వంచ పట్టణంలో ఉన్న బిక్షాటన చేసుకుంటున్న అందరికి అల్పాహారంతోపాటు భోజనాలు ఆటోలో తీసుకువెళ్లి పంచిపెట్టారు. సుమారు వెయ్యి కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గిరిజన గ్రామాలలో ఉన్న ఆదివాసీలు అందరికీ బియ్యం, నిత్యావసర వస్తువులను ఆయన అందించారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులతోపాటు ఉచిత భోజనాలు, టైలర్లు 70 మందికి నిత్యావసర వస్తువులు అందించారు. మరికొంతమంది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని స్థోమత మేరకు అందించారు. కరోనా మృతదేహాలకు స్నేహితులతో కలిసి దహనసంస్కారాలు నిర్వహించారు. ఆయన సేవల పట్ల పట్టణంలోని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్బంగా ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో పనులు లేక పస్తులున్న కుటుంబాలను చూశానని యాచకులకు తిండి దొరకక విలవిలాడుతున్నవారిని చూసి చలించిపోయానని అన్నారు. దీంతో ఎలాగైనా వీరందరికి ఆసరాగా నిలవాలని భావించి నా సొంత ఖర్చులతోపాటు స్నేహితులు, బంధువుల సహాయం తీసుకుని అండగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వారికి సేవ చేయడం పట్ల తనకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.