Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం కార్పెంటర్స్ యూనియన్ (సిఐటియు) కమిటీ ఆధ్వర్యంలో అందజేత
నవతెలంగాణ-భద్రాచలం
బండారు చందర్రావు ట్రస్టు నిర్వహిస్తున్న కరోనా ఐసోలేషన్ సెంటర్ ద్వారా కరోనా పేషంట్లకు అందిస్తున్న సేవలను తెలుసుకుని రూ.పదివేలను భద్రాచలం కార్పెంటర్స్ యూనియన్ ( సిఐటియు) కమిటి విరాళంగా గురువారం అందించారు. ఈ విరాళాన్ని నిర్వహకులు యం.బి.నర్సారెడ్డికి అందజేశారు. సేవచేస్తున్న ట్రస్టుకు ఆర్ధిసహాయం అందించటం తాము బాధ్యతగా భావిస్తున్నామని యూనియన్ గౌరవ అధ్యక్షులు అనుగోజు నర్సింహాచారి, అధ్యక్షులు,బొద్దొజు శ్రీను, కార్యదర్శి అనుగోజు మధు కోశాధికారి అప్పారి రాము తెలిపారు. భద్రాచలం బులియన్ మర్చంచ్ నాయకులు భద్రాద్రి జ్యూవెలరీ యజమాని రామెరీజి రాముడు ఐదు ట్రేల ఎగ్స్, 25 కేజిల బియ్యం అందజేశారు. స్వాతి జ్యూవెలరీ యాజమాన్యం వారు నర్సింహాచారి, సత్యనారాయణలు 100 గుడ్లు, 25 కేజిల బెల్లం 25 కేజిల బియ్యం అందజేశారు. పేషంట్లుకు పౌష్టికాహారంతో పాటు అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నామని ట్రస్టు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వహకులు గడ్డం స్వామి, కె.బ్రహ్మాచారి, యం.రేణుక, యం.బీ.నర్సారెడ్డి, బండారు శరత్ బాబు బి.వెంకటరెడ్డి, డి.లక్ష్మి, ఫిరోజ్, జ్యోతి,లీలావతి, గంగ, రామకృష్ణ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.