Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దూర ప్రాంతాలకు వెళ్లి రైతులు మోసపొవొద్దు
- డీలర్లు సామాజిక బాధ్యతగా వ్యాపారం చేస్తున్నారు.
- ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కూరబోయిన నాగేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేసి, మోసపోవోద్దని, డీలర్లు సామాజిక బాధ్యతగా వ్యాపారం చేస్తున్నారని, నకిలీ విత్తనాల అమ్మకాలు చేసే అవకాశం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కూరబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఆయన నవతెలంగాణతో మాట్లాడా రు. రాష్ట్ర ప్రభుత్వం 2016 తరువాత కొత్త వంగడాలు తయారు చేయవద్దని, ఫామ్-సీ ఉండాలని నిబంధనలు చెప్పిందన్నారు. దీన్ని సవాల్ చేస్తు రాష్ట్రంలో విత్తన కంపెనీలు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. కోర్టువారు సూచనతో అమ్మకాలకు 2021 వరకు కొనసాగింపు చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డీలర్లను ఇబ్బందులకు గురిచేయకుండా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలు లేవన్నారు. అనేక మంది డీలర్లు రైతు కుటుంబాల నుండి వచ్చినవారు, సామాజిక బాధ్యత తెలిసిన వారు ఉన్నారని తెలిపారు. రైతులను మోసం చేయాలని ఎవ్వరు చేయరని తెలిపారు. గత 30 సంవత్సరాల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్స్ ఎవ్వరూ లేరు. ఒక్క డీలర్మీద కేసులేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులు వారు వేసే విత్తనాన్ని సమీప డీలర్ వద్ద అడిగి తెలుసుకుని కొనుగోలు చేయాలన్నారు. కొన్న విత్తనాలకు, పురుగు మందులకు, ఎరువులకు బిల్లు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం డీలర్స్ విషయంలో సానుకూలంగా స్పందించినందుకు సీఎం కెసీఆర్‌కు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి జిల్లా డీలర్ల సంఘం నుండి కృతజ్ఞతలు తెలిపారు. ఫామ్-సీ లైసెన్స్ లేదన్న కారణంతో దాడులు చేస్తే సాగుకు అదును పోయి రైతులు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.