Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ విత్తనాలు, గడ్డి మందు కేసులో నలుగురు వ్యక్తులు రిమాండ్
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తనాల దందా నిరాటంకంగా కొనసాగు తోంది, నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు జోరందుకున్నాయి, భూములు చదును చేసి విత్తనాలు నాటే కార్యక్రమంలో రైతులు నిమగమైన దశలో వివిధ విత్తనాల కొనుగోలు కోసం ఫర్టిలైజర్ షాపుల వద్ద అన్నదాతలు బారులు తీరుతున్నారు, రైతన్నల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వారికి నకిలీ విత్తనాలు అంట గడుపుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రైతులను బురిడీ కొట్టిస్తు ఆకర్షణీయమైన ప్యాకింగ్లతో రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. జిల్లా అధికారులు సైతం నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రటిష్ట నిఘా ఏర్పాటు చేసిన అధికారుల కళ్లుగప్పి జోరుగా విక్రయాలు సాగిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో రైతులను కలుస్తూ మాయమాటలతో మోసం చేస్తున్నారు, వారి మాయ మాటలు నమ్మి మోసపోవడం రైతుల వంతు గా మారింది, నకిలీ విత్తనాల నియంత్రణ కు ఎన్ని చట్టాలున్నా ఉపయోగం లేకుండా పోతుంది, పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ, అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నా ఎక్కడో ఒకచోట అక్రమ దందా కొనసాగుతూనే ఉంది, మండలం పరిధిలోని గుంటుపల్లి గోపవరం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి విజయ భాస్కర్‌రెడ్డి, ఎర్రుపాలెం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిం చిన దాడిలో పట్టుబడిన నకిలీ విత్తనాలు, గడ్డి మందు విక్రయాలు జరిపిన నలుగురు వ్యక్తులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటుపల్లి గోపవరం గ్రామానికి చెందిన బోజడ్ల శ్రీనివాసరావు, బండ్లమూడి రాఘవయ్య, పెనుగొండ వెంకటేశ్వరరావులు అనుమతి లేని పత్తి విత్తనాలు ప్యాకెట్లు అమ్ముతుండగా ఆరు ప్యాకెట్లు పట్టుకొని, వాటిని స్వాధీన పరచుకున్నారు, వాటి విలువ ఐదు వేల ఒక వంద రూపాయలు, నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న గొల్లపూడి కృష్ణారావు వద్ద 350 లీటర్ల గైపోసెట్ మందును స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ లక్ష ఎనభై మూడు వేల 90 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ నలుగురు వ్యక్తులను గురువారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ఉదయ కిరణ్, శిక్షణ ఎస్ఐ వెంకటేష్, లు తెలిపారు. ఖమ్మం సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ స్నేహ మొహారా (ఐపీఎస్) వైరా ఏసిపి సత్యనారాయణ పర్యవేక్షణలో మధిర సిఐ ఓ మురళీ ఆధ్వర్యంలో నకిలీ విక్రయదారులు పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే ఉపేక్షించేది లేదని షాపులు సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు,