Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
సంవత్సరాల విద్యుత్ స్తంభం సమస్యను ఎట్టకేలకు సర్పంచ్ కృషితో విద్యుత్ అధికారులు పరిష్కరించారు. మండల పరిధిలోని కలకోట గ్రామ పంచాయతీలోని దళిత కాలనీలో కొన్ని సంవత్సరాలుగా మధ్య స్తంభం లేకపోవడం వల్ల ఇళ్ల మీద గుండా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతూ ఉంటున్నాయి. అనేక మంది సర్పంచుల దృష్టికి దళితులు ఆ సమస్యను తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు ఈ క్రమంలో సమస్యను 2 రోజుల క్రితం స్థానికులు సర్పంచ్ యంగల దయామణి దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో సర్పంచ్ వెంటనే మండల విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాగేశ్వరరావు వెంటనే స్పందించి వేలాడుతున్న విద్యుత్ వైర్లు మధ్య గురువారం మధ్య విద్యుత్ స్తంభాన్ని లైన్ ఇన్స్పెక్టర్ రాజారత్నం సహాయంతో వేయించారు. సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులకు సర్పంచ్, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చావా హరిత, లైన్ ఇన్స్పెక్టర్ రాజారత్నం, సెక్రటరీ బుద్ధుల లక్ష్మి, బందెల ముత్తయ్య, బండి ప్రసాద్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.