Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు పోరాటాలే కాకుండా సామాజిక సేవలోనూ ముందు భాగాన ఉండాలని సీపీఎం రాష్ట్ర నేత కాసాని ఐలయ్య అన్నారు. అమరజీవి జునుమాల మల్లేష్ పుట్టినరోజు సందర్భంగా పాత కొత్తగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా టెస్టింగ్, వ్యాక్సిన్‌కి వచ్చిన వారికి అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ప్రజలకు అందుబాటులో సీపీఎం కార్యకర్తలు ఉన్నారని హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా భాదితులకు సహాయ కార్యక్రమాలు చేస్తూ మనో దైర్యం కల్పిస్తున్నారని తెలిపారు. కరోనా కట్టడిలో, ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడంలో జరుగుతున్న లోపాలపై ప్రశ్నిస్తూనే తమ వంతుగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పెర్కోన్నారు. ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య ఉన్న స్థానిక సీపీఎం కార్యకర్తలను సంప్రదించాలని సూచించారు. కరోనా, బ్లాక్ ఫంగస్ వంటి జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చి సామాన్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చే భాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్భన్ హెల్త్ సెంటర్ ఆర్గనైజర్ పొన్నెకంటి సంజీవరాజు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వేంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుగులోత్ ధర్మ, జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, మల్లేష్ సోదరులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జునుమాల నగేష్, జునుమాల రమేష్, జూనుమాల వంశీ, సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు ఆవుల శ్రీరాములు కాట్రల తిరుపతిరావు కొలిపాక వేంకటేశ్వర్లు, బాసు శ్రీధర్‌రాజు పాల్గొన్నారు.