Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేత కార్యక్రమంలో జియం మల్లెల సుబ్బారావు
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణిలోని బొగ్గు గనుల్లో రక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జియం మల్లెల సుబ్బారావు అన్నారు. ఏరియా నుండి కారుణ్య నియామకాలలో భాగంగా మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల వారసులు తొమ్మిది మందికి గురువారం కార్యాలయంలో జియం మల్లెల సుబ్బారావు ఉద్యోగ నియామకాల ఉతర్వులు అందజేశారు. ఈ సందర్భంగా జియం మాట్లాడుతూ సింగరేణిలో ఉద్యోగం రావడం అదృష్టంగా భావించి బాధ్యతగా పనిచేయాలని ప్రతిఒక్కరూ భూగర్భ గనులలో పనిచేస్తే నైపుణ్యత పెరుగుతుందని అలాగే ఎల్లప్పుడూ రక్షణతో అప్రమత్తంగా ఉంటూ పనిచేయాలని పై అధికారులు తెలిపిన, రక్షణ సూత్రాలను నిత్యం పాటిస్తూ సంస్థ పురోగాభివృద్ధికి తోడ్పడాలన్నారు. సింగరేణిలో ఉద్యోగాలను వారసత్వంగా అందించిన తల్లిదండ్రులను పోషించాలని అన్నారు. ఇల్లందు ఏరియాలో మొత్తం 175 మంది దరఖాస్తులు చేసుకోగా ఇప్పటికి వరకు 133 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందచేయడం జరిగినదని అన్నారు. గురువారం తొమ్మిది మంది యువకులకు రామగుండం-1 ఏరియాలోని భూగర్భ గనులలో పనిచేయుటకు నియామక ఉత్తర్వులు అందజేశామని వీరు అర.జి-1, ఏరియా జి.యం. కు రిపోర్ట్ చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో యస్వోటు జియం బండి వెంకటయ్య, రక్షణ అధికారి పంజాల శ్రీనివాసు, ఏజెంట్ బొల్లం వెంకటేశ్వర్లు, డిజియం పర్సనల్ జి.వి.మోహన్ రావు, యూనియన్ ఫిట్ కార్యదర్శి కె.వి.రామకృష్ణ, పర్యావరణ అధికారి సైదులు, ఎస్సి లైజనింగ్ అధికారి పసుల రమేష్, పర్సనల్ అధికారి జి. శ్రీహరి, జూనియర్ అసిస్టెంట్ జి.రవి తదితరులు పాల్గొన్నారు.