Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపోడు భూముల ఇబ్బందులు తొలగించాలని మంత్రి అజరుకు విజ్ఞప్తి
- జిల్లా ప్రగతి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
అన్ని రంగాలలో ఇల్లందు జిల్లాకే ఆదర్శంగా ఉందని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం భక్త రామదాసు కళా క్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో బానోత్ హరిప్రియ నాయక్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి జిల్లాకే ఆదర్శం అని కొనియాడారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్, పాలక వర్గం అనుక్షణం పట్టణ అభివృద్ధి కోసం పని చేస్తుందని తెలిపారు. పోడు భూముల సమస్య ఇల్లందులో తీవ్రంగా ఉందని ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న వారికి ఫారెస్ట్ అధికారుల నుండి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రిని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్ లు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు