Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నేతృత్వంలో కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, జీతాలు పెంచి టెండర్ పిలవాలని సిఐటియు, ఐఎఫ్ టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా కార్మికులు అతి తక్కువ జీతంతో పని చేస్తున్నారన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఒకే కాంట్రాక్టర్ జీతాలు పెంచకుండా పనిచేయిస్తున్నారని తెలిపారు. గత నెలలో ఆసుపత్రిని సందర్శించినప్పుడు కార్మికులు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారు అన్నారు. వెంటనే హైదరాబాదులో ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లానని చెప్పారు. గత కరోనా సమయంలో విధుల్లోకి తీసుకున్న కార్మికులకు 12 నెలలుగా జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని తెలిపారు. వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయాలని, జీతాలు పెంచుతూ టెండర్లు పిలవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జి.రామయ్య, కార్మిక సంఘాల నాయకులు కాంపాటి వెంకన్న, ఆడెపు రామారావు, కమల, కళ్యాణి, మురళి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : మండల పరిధిలో వెంకటాపురం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే బాధితుడు సీఎం సహాయనిధికి దరఖాస్తు పెట్టుకోగా పరిశీలించి రూ43500రూపాయల చెక్కును మంజూరు చేయగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆ చెక్కును దుర్గాప్రసాద్‌కి శుక్రవారం అందజేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బండి రమేష్, పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్, సొసైటీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
బోనకల్ : పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ఆరోగ్య సమస్యలకు ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన బానోతు గోపికి వైద్య ఖర్చుల నిమిత్తం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం ఖమ్మంలో భానోత్ గోపీకి అందజేశారు. బానోతు గోపి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్సీ కషి మేరకు 15 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఆ 15 వేల చెక్కును ఎమ్మెల్సీ గోపీకి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి. నాగేశ్వరరావు, టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు. రామకష్ణ రావినూతల ఎంపీటీసీ కందిమళ్ళ. రాధ వైస్ సర్పంచ్ బోయినపల్లి..కొండ, సిఐటియు మండల కో కన్వీనర్ గుగులోతు.నరేష్ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు. పంతు ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు గూగులోతు శారద, అజ్మేరా గోపి, లావురి.వెంకటేశ్వర్లు సొసైటీ డైరెక్టర్ కొంగర గోపి, గొర్రె సిపిఎం రావినూతల శాఖ కార్యదర్శి మందా వీరభద్రం , సిపిఎం నాయకులు జోనిబోయిన.గురవయ్య డివైఎఫ్ఐ నాయకులు ఎర్రగాని నాగరాజు, బాణోతు. గోపి, దొండపాటి సత్యనారాయణ, గుండగాని. వాసుదేవ్, కందిమళ్ళ హరి, షేక్ నాగులమీరా, గండు సైదులు, షేక్ నన్నే సాహెబ్ పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : పేదలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.మండలంలోని ఏదులాపురం గ్రామంలో శుక్రవారం పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం ప్రజలకు మరో మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.పేద ప్రజలకు విద్య వైద్యం అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం ఏదులపురం గ్రామానికి చెందిన బొడ్డు శ్రీనివాస్‌కు 1,10,000 రూపాయలు, దేవికకు 56 వేల రూపాయలు, ఎం.రాజవర్ధన్రెడ్డికి 31,500 రూపాయలు, పి.నర్సింహారావుకి 9 వేల రూపాయలు, టీ.అచ్చమ్మకు 28,500 రూపాయలు, జి. ప్రమీలకు 38 వేల రూపాయలు, హరి దుర్గారావుకు 43,500 రూపాయలు, బీ. గోపికి 28 వేల రూపాయలు, ఎం.సత్యనారాయణ రెడ్డి కి 60 వేల రూపాయలు, సిహెచ్. లక్ష్మణ్ రావుకు 7500 రూపాయలను మొత్తం నాలుగు లక్షల యాభై వేల రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, సిపిఎం కార్పొరేషన్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్‌రెడ్డి, సిపిఎం సీనియర్ నాయకులు మాంమిడ్ల సంజీవరెడ్డి, దుండిగల నాగయ్య, వెంకటేశ్వర్లు, కొండ రవి, మధు రెడ్డి, గడ్డం సిద్దూ యాదవ్, న్యాయవాది నర్సింహారావు పాల్గొన్నారు.