Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల మండల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీపీ రేసు లకీë అన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశపు మందిరంలో సీజనల్ వ్యాధులు, ఆరవ విడత హరిత హారం కార్యక్రమం వైద్య సిబ్బంది, అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాలలో వైద్య శాఖ అద్వర్యంలో దోమ తెరలు అందజేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ దోమ తెర వినియోగించేలా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీడీ ఎం.చంద్రమౌళి, ఎంపీఓ ముత్యాలరావు, వైద్యాధికారులు బాలాజీ నాయక్, మణిదీప్, జితేందర్ నాయుడులతో పాటు ఆయా ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
కల్లూరు : ప్రస్తుతం కరోనా విస్తృతంగా దాడి చేస్తున్న సమయంలో వర్షాకాలం రావడంతో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు శానిటేషన్ పై అన్ని శాఖలు కలసి సమిష్టిగా కృషి చేయాలని ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పీటీసీ కట్టా అజరు కుమార్ కోరారు.శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శానిటేషన్ హరితహారంపై అవగాహన సదస్సు ఎంపిపి రఘు అద్యక్షన జరిగింది. సమావేశంలో ఎమ్డీవో శ్రీనివాసరావు, వైద్యాధికారి సత్య చైతన్య, ఎంపీవో వీవీ శాస్త్రి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎండీ ఇస్మాయిల్, రైతు సమితి మండల కన్వీనర్ లక్కీనేనిరఘు, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీపీ బెల్లం ఉమ అన్నారు. మండల పరిధిలో జలగంనగర్ వద్ద గల ఎంపీడీవో కార్యాలయంలో పల్లె ప్రగతిపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీపీ ఉమ మాట్లాడారు.ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడా కూడా మురుగునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్యంతో పాటుగా హరితహారంను కూడా నిర్వహించాలన్నారు.
సమావేశంలో జడ్పీటీసీ యడ్లపల్లి వరప్రసాద్, తహసీల్దారు కారుమంచి శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారి నాగరాజు, ఎంపీవో శాస్త్రి, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీదేవి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తల్లాడ వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతున్నం దున అంటువ్యాధులు ప్రలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని పినపాక రైతు వేదికలో ఎంపీపీ అధ్యక్షతన పల్లె ప్రగతి, సీజనల్ వ్యాధులుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.