Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ విస్తరణ అధికారి నాగినేని నాగసాయి
నవతెలంగాణ-బోనకల్
పత్తిలో కందిని అంతర పంటగా సాగు చేయడం వలన అనేక లాభాలు ఉన్నాయని మండల వ్యవసాయ విస్తరణ అధికారి నాగినేని నాగ సాయి తెలిపారు. మండల పరిధిలోని బయన్నపేట గ్రామంలో జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద రైతులకు కంది చిరు సంచులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి, కంది(6:1)నిష్పత్తిలో సాగుచేయడం ద్వారా అధిక దిగుబడులతో పాటు చీడపీడలను నిరోధించవచ్చు అన్నారు. పప్పు ధాన్యాల సాగు ద్వారా భూసారాన్ని పెంపొందించవచ్చు అని పేర్కొన్నారు. అదే విధంగా పప్పు ధాన్యపు పంటలను, వాణిజ్య పంటలతో కలిపి అంతర పంట గా సాగు చేయడం ద్వారా నత్రజని ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చు అన్నారు. రైతు సోదరులు అందరూ రాబోయే రోజుల్లో పప్పు ధాన్యాల సాగుకి ఆవశ్యకత ఉందని , మార్కెట్ ధరను అనుసరిస్తూ సాగు చేయవలసింది గా కోరారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.