Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా ప్రాజెక్ట్ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే రాములు నాయక్ నీటి పారుదల శాఖ అధికారులను కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం మండల ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. 5 కోట్ల నిధులతో ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను చేపడుతున్న సంగతి విదితమే. ఆనకట్ట పక్కన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను వెంటనే సిఫ్ట్ చేయాలని ట్రాన్స్‌కో ఏఈ కుమార్‌ను ఆదేశించారు. ట్యాంక్ బండ్ మద్య బాగంలో గత కొన్నేళ్లుగా తరచూ కుంగిపోతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.ప్రాజెక్ట్ నుండి ఊట నీరు బయటకు వెళ్ళకుండా అడ్డుగా ఉన్న రోడ్డును తొలగించి ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ ఏఈ అప్పారావును ఆదేశించారు. ఆనకట్టకు పక్కనే వేసిన మంచినీటి పైపు లైన్‌ను మార్చాల్సిన అవసరాన్ని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మిషన్ భగీరథ ఇంటేక్ వెల్‌ను పరిశీలించారు. స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి స్విమ్మర్స్ ఘాట్ నిర్మించాలని, ఆంజనేయ గుడికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. అంతే గాక ట్యాంక్ బండ్ పనులను పూర్తి చేయుటకు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశాల మేరకు సుడా చైర్మన్ బచ్చు విజయ కుమార్ కోటి రూపాయలు మంజూరు చేయగా వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆయన అధికారులతో చర్చించారు. ప్రాజెక్ట్ సమీపంలో గతంలో నిర్మించి నిర్వహించిన పట్టుపురుగుల కార్యాలయ శిధిల భవనాలను ఆయన పరిశీలించారు. ఆ భవనాల స్థానంలో మంజూరైన బంజారా భవన నిర్మాణం 19 లక్షలతో నిర్మించుటకు నిర్ణయించినట్లు తెలిపారు. ఆయన వెంట మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, ఐబిడిఈ ఈ శ్రీనివాసరావు, ఏఈడి రాణి, తాశీల్డార్ హలావత్ రంగా, ఎంపిడిఓ ఎన్ వెంకటపతి రాజు,మునిసిపల్ కమీషనర్ ఎన్ వెంకట స్వామి టి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి మోహనరావు, డాక్టర్ కాపా మురళీ కృష్ణ, డార్ణ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.