Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షలు పెట్టి నిర్మించారు, గాలికి వదిలేశారు
- అధికారులకు పట్టని ప్రజారోగ్యం
- ప్రారంభించాలి, ఆరోగ్య సేవలందించాలి : సర్పంచ్
నవతెలంగాణ-కొత్తగూడెం
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారకి కష్టకాలంలో వైద్యం పరంగా ఆదుకోవాలని నిర్మించిన ఉప వైద్యశాల అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది. ఎండ్లు గడుస్తున్నప్పటికీ ఎలాంటి చలనంలేకుండా జిల్లా యంత్రాంగం నిమ్మకు నిరెత్తినినట్టుగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం హేమ చంద్రాపురం, పంచాయతీ కార్యాలయం ఆఫీసు ప్రాంగణంలో నిర్మించిన ఉప ఆరోగ్య కేంద్రం ఏండ్లు గడుస్తున్నా నేటికీ ప్రారంబానికి నోచుకోలేదు. ప్రపంచం మొత్తం కోవిడ్-19, కరోనా వైరస్‌తో కుంగిపోతున్న తరుణంలో ఎలాంటి వైద్యం అందినా బతుకు జీవుడా...అని భావిస్తున్న తరుణంలో హేమ చంద్రపురం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మృగ్యంగా మారాయని ఆరోపనలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత వాసులు సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడి పోతుంటారు. అయినప్పటికీ ప్రాధమిక ఉప ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించకుండా నిరుపయోగంగా గాలికి వదిలేశారు. గత మూడేండ్ల క్రితం లక్షలు పెట్టి ఉప కంద్రాన్ని నిర్మించారు. అన్ని హంగులతో పూర్తయిన భవనాన్ని ప్రారంభించకుండానే నిర్లక్ష్యంగా వదిలే శారు. ఎండ్లు గడుస్తున్నప్పటికీ నేటికి ప్రారంభో త్సవానికి నోచుకోక పోవడంతో హేమచంద్రపురం గ్రామ పజలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రారంభించి, ఆరోగ్య సేవలందించాలి :సర్పంచ్ వెంకటేశ్వర్లు
హేమచంద్రపురంలో నిర్మంచిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభించాలని అనేక పర్యాయాలు అధికారులకు విన్నవించాం. నివేదన యాప్‌లో ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు పట్టించుకోవడంలేదు. జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసువెళ్లాం. ఫలితం లేదు. వైద్య సేవలు సకాలంలో అందక కరోనా కష్ట కాలంలో ఎంతో మంది ప్రజలు వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. రానున్న వానాకాలం దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు చొరవ తీసుకుని ఉప ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతున్నాం.