Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల కరోనా వైరస్‌తో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబీకులను శుక్రవారం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పరామ ర్శించారు. మండలంలోని దుబ్బ తండ, టేకులపల్లి, చింత లంక గ్రామాలలో ఉపా ధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ కరోనా మహమ్మారి ఉపాధ్యాయులు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బ తండకు చెందిన లకావత్ రమేష్, టేకులపల్లికు చెందిన రాళ్ళబండి రామకృష్ణ రాజు, చింత లంకకు చెందిన గుమ్మడి రాజు కుటుంబీకులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున రావాల్సి న రాయితీలను ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.కిశోర్ సింగ్, ఉపాధ్యక్షులు యన్.కృష్ణ, జిల్లా కార్యదర్శులు సక్రమ్, హాథిరామ్, టేకులపల్లి మండల కోశాధికారి బి.రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : కరోనా బారినపడి మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలను వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహారెడ్డి పాల్వంచలో శుక్రవారం వారి స్వగృహంలకు వెళ్లి పరామర్శించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జడ్పీజీఎస్ఎస్ ఉపాధ్యాయురాలు సిహెచ్ మాధవి, పీజీహెచ్ ఎం.ఎండి రఫీ, పద్మాకర్ కుటుంబాలను పరామర్శించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషోర్ సింగ్, బి.రాజు అధ్యక్షులు ఎం.కృష్ణ జిల్లా కార్యదర్శులు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.