Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల అధికారులపై ఆగ్రహం
నవతెలంగాణ-జూలూరుపాడు
మండలంలోని కాకర్ల పంచాయతీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుధిప్ శుక్రవారం అఖస్మీకంగా పర్యటన చేశారు. ఉదయాన్నే కాకర్ల పంచాయతీని గ్రామ శివారు నుండి కాలినడక నడుచుకుంటూ పంచాయతీ అభివృద్ధి పనులను పరిశీలించారు. అదేవిధంగా పంచాయతీలోని డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, పంచాయతీ పారిశుధ్య పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బంది ఉదయాన్నే ఆరు గంటలకల్లా నిధులకు హాజరు కాకపోవడంతో పంచాయతీ సిబ్బందిపై, పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సరిగ్గా పర్యవేక్షణ చేయడం లేదని మండల ప్రజా పరిషత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామంలోని పేదలకు గతంలో ప్రభుత్వం ఇండ్ల స్థలాలను మంజూరు చేసిందని, అట్టి స్థలాన్ని కొందరు అక్రమంగా పట్టాలను పొందారని వాటిపై విచారణ జరిపి పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించుకున్నారు.
చండ్రుగొండ : గ్రామాల్లో ఉదయం 6 గంటలకే పంచాయతీ సెక్రెటరీ వీధుల్లో ఉండి టాక్టర్లోకి చెత్తను సేకరించే పనులు, పారిశుధ్య పనులు ప్రారంభించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని రవికంపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. నర్సరీని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో చెట్లను, మరికొన్ని వాటిని నాటాలని అవి ఎత్తుగా ఉండేలా చూడాలని రహదారుల వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం ఐదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ, పంచాయతీ మండల పంచాయతీ ఆఫీసర్ తోట తులసిరామ్, సర్పంచ్ రమ్య, గ్రామ రైతు సమన్వయ అధ్యక్షులు భూపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.