Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెల్ప్‌లైన్ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా ఆరోగ్య విపత్తు సమయంలో ప్రజలకు చేరువుగా ఉంటూ మంచికంటి, పర్సా హెల్ప్‌లైన్ సెంటర్ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించిందని హెల్ప్‌లైన్ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం మంచికంటి భవన్లో హెల్ప్‌లైన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా జిల్లా కేంద్రంలో కరోనా సహాయక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మనోధైర్యం కల్పించడంలో విజయం సాధించామన్నారు. జిల్లా కేంద్ర ప్రధాన ప్రభుత్వ ఆసుప్రతి కొత్తగూడెంలో 300 మంది కరోనా పెషంట్ల్కు పౌష్టికాహారం అందించాలనే దృష్టితో ఎగ్ బర్యాణి పంపిణీ, అరటి పండ్లు పంపిణీ చేసామని తెలిపారు. కరోనా పేషెంట్లు, యాచకులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగిందని అయన తెలిపారు. బూడిదగడ్డ పాఠశాలలో కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్ కోసం వస్తున్న వారికి గత 12 రోజులుగా సుమారు 1000 మందికి అల్పాహారం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా సోకిన 120 కుటుంబాలను పరామర్శించి వారిలో మనోధైర్యం కల్పించడంతో వారు త్వరగా కోలుకున్నారని వివరించారు. కుటుంబ సభ్యులే దగ్గరకు రాని పరిస్ధితుల్లో మేము ఉన్నామంటూ హెల్ప్‌లైన్ సెంటర్ ద్వారా కరోనాతో మృతి చెందిన 10 మంది మృతదేహాలను దహన సంస్కారాల బాధ్యత వహించడం జరిగిందన్నారు. 200 మంది కరోనా, ఇతర జబ్బులతో ఉన్న వారిని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్య సహకారం అందించడం జరిగింది. (అడ్మిషన్, టెస్టులు) మందులు ఇప్పించ డం, ఫీజు రాయితీ ఇప్పిండం, బ్లెడ్ డోనేషన్) అందించి, 150 మందికి మడికల్ కిట్లు ఇవ్వడం జరిగిందని, కొడిగుడ్లు సమీకరించి రోగులకు పంపి ణి చేయడం లాంటి సేవా కార్యక్రమం చేయడం జరిగిందని. కిరాణా, కూరగాయాలు, బియ్యం 120 కుటుంబాలకు అందజేశామని తెలిపారు. దాతల సహాయంతో ఈ కరోనా సహాయక కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తునట్లు పేర్కొన్నారు. మానవత్వంతో ముందుకు వచ్చి కరోనా సహాయల కార్యక్రమాలకు తమ దాతృత్వం అందించిన దాత లకు ఆయన ధన్యవాదాలు, అభినందనలు తెలిపా రు. భవిష్యత్‌లో మరిన్ని సేవ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువుగా మంచికంటి-పర్సా హెల్ప్‌లైన్ సేవలు అందించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హెల్ప్‌లైన్ జిల్లా బాధ్యులు జాటోత్ కృష్ణ, లిక్కి బాలరాజు, యంవి. అప్పారావు, భూక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.