Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈఓకు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం గ్రామ పంచాయతీ నందు సుమారుగా 200 మంది వివిధ విభాగాలలో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారని, వారికి నూతనంగా ప్రకటించిన పీఆర్సి 30 శాతం అమలు చేయాలని, కనీస వేతనాలు జీవో ప్రకారం రూ.19000 వర్తింప చేయాలని కోరుతూ సీఐటీయూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈవోకి వినతి పత్రం అందజేశారు. అనంతరం జరిగిన సభనుద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే. రమేష్, యూనియన్ సెక్రటరీ యం.బీ.నర్సారెడ్డిలు మాట్లాడుతూ భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నదని గతంలో మున్సిపాలిటీగా టౌన్షిప్ పరిపాలన కొనసాగినదని పేర్కొన్నారు. అప్పుడు కార్మికులకు మున్సిపల్ వేతనాలు అమలు అయ్యాయని కానీ నేడు భద్రాచలం పంచాయతీ అన్ని పనులు మునిసిపాలిటీ పద్ధతిలో అమలు చేస్తు వేతనాలు మాత్రం గ్రామ పంచాయతీ జీవో ప్రకారం చెల్లిస్తున్నారని అన్నారు. ఇది చాలా అన్యాయం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ 30శాతం కాంట్రాక్టు ఉద్యోగులకు, కార్మికులకు, అంగన్వాడీలకు, పంచాయతీ సెక్రటరీలకు, ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అందరికీ పెంచుతున్నామని ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. కానీ గ్రామపంచాయతీ కార్మికులు గాని, మున్సిపల్ కార్మికులు గాని పెంచకపోవడం చాలా అన్యాయమని అన్నారు. కష్టకాలంలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం చాలా అన్యాయమని విమర్శించారు. వెంటనే వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం యూనియన్ అధ్యక్షులు కాపుల రవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, యూ నియన్ కార్యదర్శి ఎం.బి.నర్సారెడ్డి, బండారుశరత్ బాబు, యన్.నాగరాజు, యూనియన్ నాయకులు కృష్ణార్జున రావు, నాగేశ్వరావు, ప్రేమ్ శ్రీను, ఆది నారాయణ, శీను, అనసూ య, విజయ భాను, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.